కె సి ఆర్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు?

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 02:47 PM

కె సి ఆర్  పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు?

హైదరాబాద్: ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమ మొత్తం బయోపిక్ ల చుట్టు తిరుగుతుంది ఈ క్రమం లోనే మహానటి సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించారు
ఇప్పుడు వై యస్ రాజశేఖర్ రెడ్డి 'యాత్ర', ఎన్ టి ఆర్ చిత్రాలు కూడా విడుదలకి సిద్ధం అవుతున్నాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ పై కూడా బయోపిక్ రూపొందిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి, ఈ చిత్రం లో కె సి ఆర్ పాత్రకి ప్రముక బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్దిఖీ ని కూడా సంప్రదించారని వినిపిస్తుంది, అయితే ఓ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన నవాజుద్దిన్ ఈ వార్తలపై స్పందించారు, ఈ చిత్రం కోసం నన్ను ఎవరు సంప్రదించలేదని ఒకవేళ అవకాశం వస్తే తనకి ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చారు.





Untitled Document
Advertisements