'ఫసక్' అంటే ఏంటో చెప్పిన మనోజ్ ....

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 03:12 PM

'ఫసక్' అంటే ఏంటో చెప్పిన మనోజ్ ....

ఈ మధ్య ఇండియాటుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోహన్ బాబు 'ఫసక్' అనే పదాన్ని వాడారు, ఇప్పుడు ఈ పదం సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది అనే విషయం తెలిసిందే, ఈ విషయం మరోసారి తెర పైకి వచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా లో 'అసలు ఫసక్ అంటే ఏమిటి నేను ఎప్పుడు వినలేదు ఎవరైనా చెప్తారా' అని అడిగిన ప్రశ్నకు మంచు మనోజ్ తనదయిన శైలిలో ఈ విధంగా స్పందించారు.. 'చాలా భావోద్వేగాలతో కూడిన రియాక్షనే ఫసక్. నా ఇంగ్లిష్ తప్పయితే క్షమించు.. పూర్తిగా అర్థమే లేదనుకుంటే దండించు.. ఫసక్' అంటూ పెదరాయుడు సినిమా డయలాగు ను జత చేసి సమధానం ఇచ్చారు. ఈ సమాధానాలు చూసిన నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు.





Untitled Document
Advertisements