పరువు హత్య కేసులో వెలుగు చూస్తున్న నిజాలు ... నిందితుడికి ఆశ్రయమిచ్చిన కాంగ్రెస్ నేత!

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 10:22 AM

పరువు హత్య కేసులో వెలుగు చూస్తున్న నిజాలు ... నిందితుడికి ఆశ్రయమిచ్చిన కాంగ్రెస్ నేత!

మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసులో భాగంగా జరుగుతున్న విచారణ లో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయి, ముఖ్య నిందితుడు నల్గొండ రౌడి షీటర్ అబ్దుల్ భారీ తో పాటుగా మారుతీ రావు కారు డ్రైవర్, హత్యకు పాల్పడిన వ్యక్తి, హంతకుడిని బైక్ పై తరలించిన వ్యక్తి తో సహా మొత్తం తొమ్మిది మంది ఈ కుట్ర లో నిందితులుగా ఉన్నట్లుగా సమాచారం.బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మరో రెండు రోజులలో నిందితులను పట్టుకుంటామన్నారు.

ఇదిలా ఉండగా మారుతీ రావు స్నేహితుడు అయిన స్థానిక కాంగ్రెస్ నేత కరీం కూడా నేరానికి సహకరించినట్టుగా వెల్లడైంది, హత్యకు ఒకరోజు ముందు నిందితుడికి కరీం తన ఇంట్లో ఆశ్రయం కల్పించినట్లుగా తెలుస్తుంది అంతేగాక ప్రణయ్ ఇంటి కి చేరువలోనే కరీం నివాసం ఉండడం వల్ల ప్రణయ్ అమృతల కదలికలను మారుతీ రావు కు చేరవేస్తుండేవాడని తేలింది. ఈ సందర్బంగా మంత్రి కె టి ఆర్ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా స్పందిన్చారు.

Untitled Document
Advertisements