టిడిపి నాయకుడు జనసేనలోకి

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 10:49 AM

టిడిపి నాయకుడు జనసేనలోకి

విజయవాడ : ఏపీలో వలస రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ నాయకులు గోడ దూకే పనిలో పడ్డారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ప్రతిపక్షాల నాయకులు అధికారపక్షంలో చేరుతుంటే.. అధికార పక్షం నేతలు విపక్షాల వైపు చూస్తున్నారు. తాజాగా ఓ టీడీపీ నాయకులు జనసేన వైపు చూస్తున్నారు.విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతంలో మంచి పట్టున్న టీడీపీ నేతల్లో ఒకరైన సుందరపు విజయ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి చర్చించడం రాజకీయంగా కొత్త చర్చలకు దారితీసింది.

ఒక వారంలోగా నియోజకవర్గ నాయకులు ,అభిమానులు ,మిత్రులతో సమావేశమై జనసేనలో చేరిక విషయమై నిర్ణయం తీసుకుంటామని అన్నారు . నియోజకవర్గంలో టిడిపి పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేసిన విజయకుమార్ కు పార్టీలో అధిష్ఠానం వద్ద సరైన గుర్తింపు లేక కొంతమేర అసంతృప్తితో ఉన్నట్లు అనుచరుల్లో వినిపిస్తుంది.సుందరపు విజయకుమార్ ఏ పార్టీలో చేరిన మీ వెన్నంటే ఉంటాం అనే స్వరం అభిమానుల్లో ,ప్రజల్లో వినిపిస్తుంది .యలమంచిలి నియోజకవర్గ జనసేన ద్వితీయశ్రేణి నాయకులు కూడా మంచి నాయకుడని స్వాగతించేందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

2014లో తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, లోకేశ్ ను కలిసి తన బాధలు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు

Untitled Document
Advertisements