ఆత్మహత్యలు తగ్గాలంటే విద్యా విధానం లో మార్పులు రావాలి

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 10:58 AM

ఆత్మహత్యలు తగ్గాలంటే విద్యా విధానం లో మార్పులు రావాలి

హైదరాబాద్: ఈ నెల 18 న నల్సార్ యూనివర్సిటి విద్యార్థులతో భేటీ కానున్న సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ హైదరాబాద్ విచ్చేసారు, విలేకరులసమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితం లో వైఫల్యాలనేవి సర్వసాధారణం, అవి లేకుండా జీవితం ముగిసిపోవడం అన్స్ది జరగదని యువత వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు.

"చదువులో విఫలమయినందుకు, సెల్ ఫోన్ కొనివ్వనందుకు, పెద్ద వాళ్ళు మందలిచ్చినందుకు యువత ఆత్మహత్యలకు పాల్పడటం మనం చూస్తూనే వున్నాం 2017 సంవత్సరం లో 18 ఏళ్ల లోపు యువత 18600 మంది ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం" అని వ్యాఖ్యానించారు, ఆత్మహత్యలు తగ్గాలంటే విద్యావిధానం లోనే మార్పు రావాలని సూచించారు, ప్రస్తుతం విద్యార్థులను పారిశ్రామిక వస్తువులు గానే చూస్తున్నారే తప్ప ఉద్యాన వనం లో పెంచే మొక్కలుగా పరిగణించడం లేదని ఆయన వాపోయారు. యువత దురలవాట్లకు లోను కావోద్దని రాజకీయాలలో చేరి మార్పు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements