ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్న కేంద్ర పభుత్వం...

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 11:33 AM

 ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్న కేంద్ర పభుత్వం...

న్యూఢిల్లీ: రోగుల హక్కులపై అధికార పత్రం ముసాయిదా ను జాతీయ మానవ హక్కుల కమీషన్ (ఎన్ హెచ్ఆర్సీ) విడుదల చేయనుంది, ఈ చార్టర్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమ వెబ్ సైట్ లో పొందుపరుచనుంది. ఇందులోని వివరాల ప్రకారం....ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లాలనుకునే రోగిని, మరణించిన రోగిని తప్పుడు పద్దతుల ద్వారా లేదా ఫీజు కట్టలేదని అడ్డుకోవడం మరియు మృతదేహాన్ని నిలిపివేయడం లాంటి చర్యలని తీవ్ర నేరం కింద పరిగనించనుంది.

రోగికి అందిన వైద్యసేవలు, చికిత్సను గురించిన విషయాలను ఎప్పటికప్పుడు రోగి తరపు బందువులకు విధిగా తెలపవలసిన భాద్యత యాజమాన్యానికి ఉన్నదని పేర్కొన్నది, అదే విధంగా వారు అడిగిన పేపర్స్, ఇండోర్ పేషంట్ రికార్డ్స్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తాలుక ఒరిజినల్స్ ను 24 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా అందజేయాలని తెలిపింది.

ఆసుపత్రి పై రోగి బందువులు ఎటువంటి ఫిర్యాదు చేసినా 15 రోజులలోగా లికిత పూర్వక సమాధానం ఇవ్వవలసినదిగా ఈ డ్రాఫ్ట్ లో తెలిపారు. అయితే ఈ రోగుల హక్కుల పత్రం పై ప్రజల అభిప్రాయాలను, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోనుంది, ఆ తరువాత దీనిని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలులోకి తెచ్చే ప్రయత్నం లో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది.





Untitled Document
Advertisements