ఇంతవరకూ హీరోయిన్లను అసభ్యంగా చూపించలేదు

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 02:15 PM

ఇంతవరకూ హీరోయిన్లను అసభ్యంగా చూపించలేదు

హైదరాబాద్: 'ఈరోజుల్లో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు మారుతి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు, ఈ మద్యన విడుదలైన శైలజ రెడ్డి అల్లుడు సినిమా ధియేటర్ లలో సందడి చేస్తుంది.

మారుతి దర్శకత్వం లో వచ్చిన కొన్ని సినిమాలలో ద్వంద అర్దాలు వచ్చే మాటలు, సన్నివేశాలు ఉంటాయని ఒక విమర్శ ఉంది. 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ' ప్రోగ్రాముకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ విషయం చర్చకు రాగా తన మనసులో మాటల ను ఈ విధంగా చెప్పుకొచ్చారు, "నేను ఏ రోజు నా సినిమాల్లో అసభ్యతను చూపించాలి అనుకోలేదు, ఇంతవరకూ ఏ హీరోయిన్లను అసభ్యంగా చూపించలేదు. మీరు ఒకసారి నా సినిమాలు చూడండి నా ప్రతి సినిమా లోనూ ఒక సందేశం ఉంటుంది, 'ఈరోజుల్లో' సినిమాతో అబ్బాయిలను మోసం చేయకూడదని, 'బస్టాప్' సినిమాలో తల్లిదండ్రులని నమ్మించవద్దని చెప్పే ప్రయత్నం చేశాను అలాగే చిన్న విషయాలకే సూసైడ్స్ చేసుకోవద్దని 'ప్రేమకథా చిత్రమ్'లో చూపించాను, లోపం ఉన్న వ్యక్తి ఎందుకు ప్రేమించకూడదు? అనే విషయాన్ని 'భలే భలే మగాడివోయ్' సినిమా ద్వారా చెప్పాము, 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమాలో కూడా పిల్లలు పెళ్లి విషయాన్ని తమ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంచాలి అనే సందేశం కనిపిస్తుంది" అంటూ సమాధానం ఇచ్చారు





Untitled Document
Advertisements