మలయాళం సీనియర్‌ నటుడు కన్నుమూత

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 02:25 PM

మలయాళం సీనియర్‌ నటుడు కన్నుమూత

మలయాళం నటుడు కెప్టెన్ రాజు సోమవారం ఉదయం కన్నుమూశారు. 68 ఏళ్ల ఆయన కొచ్చిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. నేడు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కెప్టెన్ రాజు 1981లో రక్తం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో 500 చిత్రాలకుపైగా నటించారు

తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

కొద్ది నెలల క్రితం అమెరికా వెళ్తుండగా.. ఆయనకు విమానంలో గుండె పోటు వచ్చింది. దీంతో ఒమన్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాడింగ్ చేసి చికిత్స అందించారు. తర్వాత కుటుంబ సభ్యుల వినతి మేరకు చికిత్స కోసం ఆయన్ను మస్కట్ నుంచి కొచ్చి తీసుకొచ్చారు.





Untitled Document
Advertisements