కింగ్ ఖాన్ పై ముస్లిం ల ఆగ్రహం

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 04:49 PM

కింగ్ ఖాన్ పై ముస్లిం ల ఆగ్రహం

ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై ముస్లిం లు తీవ్ర స్థాయి లో మండిపడ్డారు, 'నీవసలు ముస్లిం వేనా?' అంటూ ప్రశ్నించారు, వినాయక చవితి సందర్బంగా తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించారు షారుఖ్, తన చిన్న కుమారుడు అబ్రాం వినాయకుడి పూజని చేస్తున్న చిత్రాన్ని తీసి "మా వాడు పిలిస్తే గణపతి బప్పా ఇంటికి వచ్చాడు" అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు, ఈ పోస్ట్ ని చూసిన మతస్తులు "ముస్లిం వి అయ్యుండి వినాయక చతుర్థి ఎలా జరుపుకుంటావు, ఇస్లాం లో విగ్రహారాధన నిషేధం అని మరిచావా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగా బాలీవుడ్ లో ముస్లిం హీరో లు ఈ విధంగా చేయడం కొత్తేమి కాదు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి వారు కూడా ప్రతి ఏట విగ్రహ ప్రతిష్ట చేయడం, గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం లాంటివి ఎప్పటినున్డో చూస్తున్నవే. ఈ పరిణామానికి షారుక్ ఏ విదంగా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.





Untitled Document
Advertisements