ఆసియాకప్‌: శ్రీలంక ఔట్..

     Written by : smtv Desk | Tue, Sep 18, 2018, 11:10 AM

ఆసియాకప్‌:  శ్రీలంక  ఔట్..

ఆసియాకప్‌లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్‌ దశలోనే శ్రీలంక నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓడిన లంక.. రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ ముందు చతికిలబడింది. 91 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 250 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్ల ధాటికి 41.2 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. తొలి బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. తిసార పెరీరా 55 పరుగులకు 5 వికెట్లు తీశారు.

Untitled Document
Advertisements