బిగ్ బాస్ కంటెస్టెంట్ తో బోయపాటి సినిమా

     Written by : smtv Desk | Tue, Sep 18, 2018, 12:13 PM

బిగ్ బాస్ కంటెస్టెంట్  తో బోయపాటి సినిమా

హైదరాబాద్: బిగ్ బాస్ -2 షో తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్ కౌశల్, ఆయన కోసం బయట ఒక సైన్యమే ఉంది అంటే ఆయనకు ఎంత ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యం గా యువతకు కౌశల్ బాగా నచ్చడం తో ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డ దర్శక నిర్మాతలు , కౌశల్ కోసం అవకాశాలతో సిద్ధంగా ఉన్నారంట .

అయితే మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు బోయపాటి శీను కౌశల్ ని తన సినిమాలో ప్రతినాయకుడి పాత్ర లో చూపించాలని అనుకుంటున్నారట, బోయపాటి సినిమాలో ప్రతినాయకుడి పాత్ర అంటే ఏ విదంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, లయన్ సినిమాలో జగపతి బాబు పాత్ర మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ సినిమాతో జగపతి బాబు కి బాలీవుడ్ లో సైతం అవకాశాలను తెచ్చిపెట్టిన ఘనత బోయపాటిదే. ఈ అవకాశాన్ని కౌశల్ ఏ విదంగా సద్వినియోగం చేసుకుంటాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.





Untitled Document
Advertisements