దుబాయ్‌లో త్రిష

     Written by : smtv Desk | Tue, Sep 18, 2018, 02:56 PM

దుబాయ్‌లో త్రిష

చెన్నై: తెలుగు ఇండస్ట్రీ లో దశాబ్ద కాలంగా హీరొయిన్ గా తన హవా కొనసాగించిన చెన్నై భామ త్రిష, ప్రస్తుతం.. విజయ్ సేతుపతి జంటగా '96' అనే తమిళ చిత్రం లో నటిస్తుంది.

విషయం లోకి వెళితే ఈ మధ్యనే త్రిష ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇరకాటంలో పడింది, ఈత కొలనులో ఈత కొడుతూ ఓ డాల్ఫిన్ కి ముద్దు పెట్టింది త్రిష, ఆ డాల్ఫిన్ కూడా త్రిషకి ముద్దు పెట్టింది. ఈ సన్నివేశాన్ని ఫొటోలో బందించి "లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను నమ్మండి" అని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది, అయితే అయినదానికీ కానీ దానికి తప్పులు వెతికే కొంతమంది "నువ్వు జంతు ప్రేమికురాలినని చెప్పుకుంటూ బందించి ఉంచి స్వేచ్ఛ లేకుండా చేసిన డాల్ఫిన్ తో ఫోటోలు ఎలా దిగుతావు" అని నిందించారు. కొంతమంది మాత్రం సానుకూలంగా స్పందిస్తూ 'చాలా అందంగా ఉంది' అని కామెంట్ లను పోస్ట్ చేసారు.





Untitled Document
Advertisements