బాలయ్యను మెప్పించిన ' సుప్రీం' దర్శకుడు

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 12:06 PM

బాలయ్యను మెప్పించిన ' సుప్రీం' దర్శకుడు

హైదరాబాద్: 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమై సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం వేంకటేశ వరుణ్ తేజ్ హీరో లుగా 'ఎఫ్ 2' అనే చిత్రం తో తీరిక లేకుండా ఉన్నాడు అనిల్.

అయితే తన తరువాతి సినిమాని బాలయ్య బాబు హీరో గా తెరకెక్కించాలనే ఉద్దేశం తో దర్శకుడు అనిల్ ఉన్నాడని తెలుస్తుంది, ఇందులో భాగంగా అనిల్ వినిపించిన కథని బాలకృష్ణ ఒకే చేసారని సమాచారం. ఈ సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి మార్కు ఎంటెర్టైమెంట్ కి బాలకృష్ణ ఎనర్జీ తోడైతే అభిమానులు జై బాలయ్య అనాల్సిందే మరి.





Untitled Document
Advertisements