చెన్నై వైపు సుందరి చూపు

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 12:38 PM

చెన్నై వైపు సుందరి చూపు

చెన్నై: దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు చేతుల మీదగా పరిచయమైన నటీమణులందరు దాదాపుగా చిత్ర సీమలో చక్రం తిప్పిన వారే అందులో ముంబై భామ తాప్సి ఒకరు. చదువు పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మారిన తాప్సిని అనుకోకుండా 'జుమ్మంది నాదం' సినిమా లో అవకాశం తలుపు తట్టింది, ఆ తరువాత తెలుగు లో చేసిన కొన్ని సినిమాలు పరాజయం పొందినా, బాలీవుడ్ లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వం లో తాప్సి నటించిన 'పింక్' చిత్రం తో మంచి నటనను కనబరిచి ప్రశంసలందుకుంది, అయితే గత కొంత కాలంగా తెర పై కనిపించని తాప్సి ఒక తమిళ చిత్రం లో కనిపించనుందని సమాచారం, ఇంకా ఈ సినిమాకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ నేపథ్యం లో...అతి తక్కువ సమయం లోనే 'గ్లామర్ డాల్' అనే ముద్రని చెరిపి వేసుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి ఈ సినిమాతో మళ్ళీ వేగం పెంచుతుందని తాప్సి అభిమానులు ఆశిస్తున్నారు.





Untitled Document
Advertisements