ప్రేమికుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ప్రణయ్ హత్య

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 01:09 PM

 ప్రేమికుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ప్రణయ్ హత్య

కడప: ఇటవల మిర్యాలగూడ లో పరువు హత్యకు బలైన ప్రణయ్ ఘటన చాల మంది ప్రేమికులకు నిద్ర లేకుండా చేస్తుంది, కడప జిల్లాకి చెందిన మరో జంట తమకు తమ తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందని పోలీసులు తమకు రక్షణ కల్పించాలని లేకపోతే మా జీవితాలు కూడా ప్రణయ్ లాగే అర్దాంతరంగా ముగిసిపోతుంది అని వేడుకున్నారు
వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సత్యం రెడ్డి, పద్మావతి దంపతుల కుమార్తె శివ దీప్తి , ప్రణయ్ అమృతల మాదిరిగానే పెద్దలను ఎదురించి కడప జిల్లాకి చెందిన విజయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, విజయ్ కుమార్ దళిత వర్గానికి చెందిన యువకుడు కావడం తో అమ్మాయి తల్లితండ్రులు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు, ఈ విషయమై విజయ్ కుమార్ దంపతులు మీడియా మరియు పోలీసులు తమకి అండగా నిలవాలని కోరుతున్నారు. తమ బంధువులైన చరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో ఉన్నారని వారి సహాయంతో మమ్మల్ని ట్రేస్ చేస్తున్నారని అంతేగాక రౌడీ షీటర్లతో తమను చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని వాపోయారు.

Untitled Document
Advertisements