తమిళ కమెడియన్ కి చుక్కలు చూపిస్తున్న 'ఘట్టమనేని' అభిమానులు

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 01:57 PM

తమిళ కమెడియన్  కి చుక్కలు చూపిస్తున్న 'ఘట్టమనేని' అభిమానులు

చెన్నై: ప్రముఖ టీవీ షో లో భాగంగా మహేష్ బాబు పై పంచులు వేసి అగాథం లో పడ్డ తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్, ఒక చిన్న తప్పిదం తనని ఇంతలా వెంటాడి వేధిస్తోందని ఊహించి ఉండడేమో, మనోజ్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పినా కూడా మహేష్ అభిమానులు కనికరించడం లేదు ఫాన్స్ ధాటికి సోషల్ మీడియా అకౌంట్ ల నుండి తప్పుకుని అజ్ఞాతం లో గడుపుతున్నాడు అయితే ఇటీవల మనోజ్ స్నేహితులకు, బంధువులకి కూడా ఈ వివాదం యొక్క సెగ తగలడం తో తన ఫేస్ బుక్ ఖాతాను మళ్ళీ తెరిచి ఒక వీడియో ను పోస్టు చేసాడు.
అందులో " నేను ఎటువంటి పబ్లిసిటీ కోసం ఈ విదంగా చేయలేదు, నా వల్ల జరిగిన పొరపాటుకు నేనే బాధ్యుడని ఇందులోకి నాకు సంభందించిన వాళ్ళను లాగొద్దు, మహేష్ బాబు అంటే నాకెంతో గౌరవం నా వీడియో వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే మరొక్కసారి క్షమాపణలు కోరుతున్నాను." అని ఈ వీడియో లో తెలిపాడు, ఎంత క్షమాపణలు చెప్పినా ఇప్పట్లో అభిమానుల ఆగ్రహం చల్లారేలా లేదు ఇప్పటికయినా మహేష్ ఈ విషయం లో కలుగజేసుకుంటే తప్ప గొడవ సద్దుమణిగేలా లేదు అని సగటు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.





Untitled Document
Advertisements