ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ లేకపోతే అంతేనా...?

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 02:52 PM

ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ లేకపోతే అంతేనా...?

హైదరాబాద్: ఎంత స్వయం కృషితో పైకొచ్చినా చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకపోతే నెగ్గుకురాలేరు అనే అభిప్రాయం చాలామంది నటులు అడపా దడపా వ్యక్తం చేస్తూనే ఉంటారు, అయితే కమెడియన్ సప్తగిరి విషయం లో ఇది నిజమనే అంటున్నారు సినీ విశ్లేషకులు ఎందుకనగా 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో నవ్వులు పూయించి సినిమా విజయం లో భాగం అయిన సప్తగిరికి ఆ తరువాత వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి.
సునీల్ లాంటి స్టార్ కమెడియన్ లు హీరో పాత్రలతో బిజీ గా ఉండడంతో సప్తగిరి కి అవకాశాలు పెరిగాయి, ఆ జోరు కొనసాగిస్తూ 'సప్తగిరి ఎల్ఎల్బి 'అనే సినిమాలోకథానాయకుడిగా కూడా ప్రయత్నించాడు అక్కడే మొదలైంది అసలు చిక్కంతా, ఒక కమెడియన్ హీరో గా ఎదగడం ఇష్టం లేని ప్రముఖులు తనని అవకాశాల విషయం లో చిన్న చూపు చూస్తున్నారు, ఇందుకు కారణం పరిశ్రమలో తనకి అండ లేకపోవడమే ని సప్తగిరి అభిమానులు భావిస్తున్నారు, అయితే త్వరలోనే ఒక సినిమాకి దర్శకత్వం వహించే ఆలోచనల్లో సప్తగిరి ఉన్నట్టు తెలుస్తుంది ఈ సినిమాతో ఈ కమెడియన్ మళ్ళీ గాడి లో పడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట.





Untitled Document
Advertisements