అవును ఆస్తమా ఉంది... అయితే ఏంటి ?

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 03:17 PM

అవును ఆస్తమా ఉంది... అయితే ఏంటి ?

ముంబై: ఈ మధ్య బాలీవుడ్ నటీమణులు తమ ఆరోగ్య సమస్యల గురించి బాహాటంగానే మాట్లాడుతున్నారు పైగా వాటిని దాచాల్సిన అవసరం లేదని చెప్తున్నారు, ఆ మధ్యకాలం లో తాను మానసిక ఆందోళన (డిప్రెషన్ ) కి గురయ్యానని వెల్లడించి కంట నీరు పెట్టుకుంది ఆ సమయం లో తన కుటుంబ సభ్యులు తనను ఎంతగానో ఆదరించారని అందుకే ఆ అవస్థ నుండి బయట పడగలిగానని పేర్కొంది.

ఇప్పుడు ఇదే కోవలోకి నటి ప్రియాంక చోప్రా చేరింది, తనకు ఆస్తమా(శ్వాస కోశ వ్యాధి) ఉన్నదని ట్విట్టర్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది. అయితే ఈ విషయం తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసనీ ఇందులో దాచుకోవలసిన అవసరం ఏమిలేదని అన్నది , ఆస్తమా తో ఇబ్బంది పడేవారు ఇన్హేలర్ ని వాడటమే శ్రేయస్కరమని 'ది బ్రీథ్ ఫ్రీ' అనే సంస్థ చేస్తున్న క్యాంపెయిన్ కి తన మద్దతు ప్రకటిస్తూ "నా దగ్గర ఇన్హేలర్ ఉన్నంత వరకు నా జీవిత లక్ష్యాలను చేరుకోవడం లో ఈ వ్యాధి నన్ను ఆపలేదు " అని వ్యాఖ్యానించింది.





Untitled Document
Advertisements