మోదీ సర్కారు సంచలన నిర్ణయం

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 03:26 PM

మోదీ సర్కారు సంచలన నిర్ణయం

ట్రిపుల్ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. ఈ ఆర్డినెన్స్‌లో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టంలో ఏదైతే ఉందో అవే ట్రిపుల్ తలాక్ బిల్లులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బిల్లును చట్టంగా మార్చింది కేంద్రం.

ముస్లిం మహిళల హక్కులను కాపాడటం కోసం ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ విపక్షాలు అభ్యంతరాలు లేవనేత్తడంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదు.





Untitled Document
Advertisements