తెలుగులో భారీ బడ్జెట్ మూవీ

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 03:28 PM

తెలుగులో భారీ బడ్జెట్ మూవీ

తమిళ యువ దర్శకుడిగా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న అట్లీ రాజా రాణి, తెరి, మెర్సల్ సినిమాలతో వరుసగా మూడు సూపర్ హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న అట్లీ తెలుగులో భారీ బడ్జెట్ మూవీకి సిద్ధమవుతున్నాడట. అశ్వనిదత్ నిర్మాణంలో అట్లీ డైరక్షన్ లో ఓ మెగా మూవీ ప్లాన్ చేస్తున్నారట. అట్లీ ఇప్పటికే ఎన్.టి.ఆర్, మహేష్ లతో సినిమా చేయాలని ఉందని అన్నాడు.

అశ్వనిదత్ నిర్మాణంలో ఎన్.టి.ఆర్ ఓ సినిమా ఉంటుందని ఇంతకుముందే చెప్పారు. ఆ ప్రాజెక్ట్ ఇదే అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మల్టీస్టారర్ మూవీ ఉండనే ఉంది. ఆ సినిమా అయ్యాక కాని అట్లీ సినిమా చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి అశ్వనిదత్ అట్లీ ఎన్.టి.ఆర్ భారీ మూవీనే ప్లాన్ చేశారని తెలుస్తుంది.





Untitled Document
Advertisements