బాబ్లీ కేసు: విచారణకు చంద్రబాబు హాజరుకారట

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 07:30 PM

బాబ్లీ కేసు: విచారణకు చంద్రబాబు హాజరుకారట

బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందుకొన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈనెల 22వ తేదీన సిఎం చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు వెళుతున్నందున కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఆయన తరపున న్యాయవాదులు ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఉపసంహరించుకోవలసిందిగా న్యాయమూర్తిని అభ్యర్ధించనున్నారు.

సుమారు 8 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 16 మంది టిడిపి నేతలు మహారాష్ట్రాలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మితమవుతున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో ఉంచారు. అప్పటి నుంచి ఆ కేసు అనేకమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడుకు అనేకసార్లు నోటీసులు పంపినపటికీ స్పందించకపోవడంతో ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు నాయుడుతో సహా 16 మందిని అరెస్ట్ చేసి ఈనెల 21న కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తూ వారిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది

Untitled Document
Advertisements