మాధవి పరిస్థితి చాలా విషమం

     Written by : smtv Desk | Thu, Sep 20, 2018, 02:22 PM

మాధవి  పరిస్థితి చాలా విషమం

అల్లారు ముద్దుగా పెంచుకొన్న కూతురి పసుపుకుంకమలను తుడిచేవేయగల తండ్రి ఉంటారని మారుతీరావు నిరూపిస్తే, గోరుముద్దలు తినిపించిన చేతితోనే కన్న కూతురిని కత్తితో నరికి చంపాలనుకొనే తండ్రి కూడా ఉంటారని నిన్న మనోహరాచారి నిరూపించి చూపాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన కుమార్తె మాధవి యశోదా ఆసుపత్రిలో ఇంకా మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కొద్దిసేపటి క్రితం యశోదా ఆసుపత్రి ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆమెను ఇంకా వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆమె ప్రాణాలు కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని మరో 48 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితి చెప్పలేమని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. ఆమెను ఆసుపత్రికి తీసుకురాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె మెదడుకు రక్త ప్రసారం పునరుద్దరించేందుకు అవసరమైన ఆపరేషన్ చేశామని, అదే సమయంలో పూర్తిగా తెగి వ్రేలాడుతున్న ఆమె చేతిని తిరిగి అతికించామని పేర్కొన్నారు. ఈ దాడి కారణంగా ఆమె తీవ్ర ఒత్తిడికి గురవడంతో అది కూడా ఆమె ఆరోగ్యపరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

Untitled Document
Advertisements