ఆసియా కప్‌: భారత్ ప్రతీకారం

     Written by : smtv Desk | Thu, Sep 20, 2018, 03:39 PM

ఆసియా కప్‌: భారత్ ప్రతీకారం

ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 29 ఓవర్లలో చేధించింది. దీంతో గత ఛాంపియన్ షిప్ పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు.

ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ పెవిలియన్ చేరాడు. అనంతరం మరో ఓపెనర్ ధావన్.. అంబటి రాయుడుతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. జట్టు స్కోర్ 104 వద్ద ధావన్ 46(54 బంతుల్లో 4x6, 6x1) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(31), దినేష్ కార్తీక్(31)లు ఆడుతూ పాడుతూ పరుగులు సాధించి భారత్ కి విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్, అష్రాఫ్ తలో వికెట్ తీశారు.

'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' భువనేశ్వర్ కుమార్ కు దక్కింది.

Untitled Document
Advertisements