మొహరం, గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

     Written by : smtv Desk | Thu, Sep 20, 2018, 06:26 PM

మొహరం, గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

హైదరాబాద్ నగరంలో రేపటి మొహరం, ఈ నెల 23న జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడాతూ, మొహరం, గణేష్ నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాటు చేయడం సవాల్ తో కూడుకున్నదని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements