కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 02:54 PM

కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి

మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్... కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు... ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, జానారెడ్డి సమంక్షలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి రమేష్‌ రాథోడ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఎంపీగా పనిచేసిన రమేష్ రాథోడ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు... రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పి కారెక్కిన రమేష్ రాథోడ్... టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ టికెట్ ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో ఖానాపూర్‌ టికెట్ ఆయనకు రాకపోవడంతో... కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Untitled Document
Advertisements