అఫ్గానిస్థాన్‌ భారీ విక్టరీ

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 03:03 PM

అఫ్గానిస్థాన్‌ భారీ విక్టరీ

ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌ భారీ విజయాన్ని అందుకుంది. 'బర్త్ డే బాయ్' రషీద్‌ ఖాన్‌ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్‌ జట్టు బంగ్లాపై 137 పరుగుల తేడాతో గెలుపొందింది. 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 42.1 ఓవర్లలో 119 పరుగులకే ఆలాట్ అయింది. ఓపెనర్లు దాస్(6), శాంటో(6) త్వరగానే పెవిలియన్ చేరారు. షకీబ్(32) పోరాడుతున్నా.. హాక్(9), మిథున్(2) కూడా సింగల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. మిడిలార్డర్‌లో మహ్మూదుల్లా (27), మొసద్దిక్‌ హొస్సేన్‌ (20 నాటౌట్) కొద్దిసేపు ఆదుకున్నారు. హొస్సేన్‌ క్రీజ్ లో ఉన్నా.. అవతల ఎండ్ లో వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. దీంతో బంగ్లా చేతులెత్తేసింది. రషీద్‌, గుల్బదిన్‌ నైబ్‌ 2 వికెట్లు తీశారు. ఈ గ్రూపు నుండి అఫ్గాన్, బంగ్లాదేశ్‌ 'సూపర్‌–4'కు చేరాయి.

Untitled Document
Advertisements