టాంజానియాలో ఘోర ప్రమాదం

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 03:32 PM

టాంజానియాలో పడవ మునిగి 50 మంది మరణించారు. విక్టోరియా సరస్సులో ప్యాసింజర్లను తీసుకెళ్తున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. దీంతో 50 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు చీకటి పడడంతో రెస్క్యూ టీమ్స్ పూర్తి స్థాయిలో బాధితుల్ని వెదకలేకపోయాయి. అందువల్ల మృతులు పెరిగే అవకాశం ఉంది. పడవలో 100 కు పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

Untitled Document
Advertisements