బాలీవుడ్ సినిమాల్లోకి విరాట్ కోహ్లీ

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 03:57 PM

బాలీవుడ్ సినిమాల్లోకి విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ముఖానికి రంగేసుకోబోతున్నాడా? మైదానాన్ని దున్నినట్లు బాలీవుడ్డునూ దున్నేయబోతున్నాడా? అవుననే అనిపిస్తోంది అతడు తన ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్టును చూస్తోంటే.ఈ వాదనకు బలం చేకూరుస్తూ అతడు దుబాయ్‌లో జరుగుతున్న ఏషియకప్‌కు దూరంగానూ ఉన్నాడు. దీంతో కోహ్లీ ప్రస్తుతం సినిమా చిత్రీకరణలో ఉన్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ట్విటర్లో పెట్టిన సదరు పోస్టర్‌పై ‘ఇంట్రడ్యూసింగ్ విరాట్ కోహ్లి.. ద మూవీ‌ ’అని రాసి ఉంది. పోస్ట్‌లో ‘పదేళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా సినిమాల్లోకి వస్తున్నాను. వెయిట్ చేయలేకపోతున్నాను’ అని కామెంట్ చేశాడు ఆటగాడు. దీంతో విరాట్ అభిమానులకు ఇది పండగలా మారింది. కోహ్లీ భార్య అనుష్క శర్మ సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తే ఇంకా బాగుటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ జంటమాన్యవర్ యాడ్‌లో నటించింది.

Untitled Document
Advertisements