గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదా?

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 06:29 PM

గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదా?

హరీశ్ ఈ రోజు తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ లో పర్యటించారు. ‘మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే ఉద్వేగంగా ఉంది. మీ రుణం తీర్చుకోలేనని అనిపిస్తోంది. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ ఉన్నప్పుడే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉంది. ఈ జన్మకు ఇది చాలనిపిస్తోంది. ఇంతకంటే ఈ జన్మకు ఇంకేం కావాలి. నాకు ఊపిరి ఉన్నంత కాలం, పదవిలో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా మీకు సేవ చేస్తా.. మీ ఆదరాభిమానాలను గుండెల్లో పెట్టుకుంటాను..’ అని అని అన్నారు.అంతకు ముందు కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకున్నామని అన్నారు. ‘తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండె. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ ప్రకటన చేశారు. గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదా?’ అని ప్రశ్నించారు.

Untitled Document
Advertisements