ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలంగాణలో పోటీ

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 12:32 PM

  ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)  తెలంగాణలో పోటీ

హస్తినలో తిష్ట వేసిన చీపురు పార్టీ తెలంగాణలో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ నేత సోమనాథ్ భారతీ చెప్పారు. మొత్తం సీట్లల్లో ఎక్కడ ఎవర్ని నిలబెట్టాలనే విషయంలో చర్చలు జరుగుతున్నాయట. ఢిల్లీ తర్వాత ఆప్ మిగతా రాష్ట్రాల్లో పెద్దగా గెలవ లేక పోయింది. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే పార్టీకి అంత మంది అభ్యర్థులు దొరుకుతారా? దొరికినా ప్రచారం ఎలా అనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఢిల్లీలో ఎవరూ ఊహించని విధంగా అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు తీవ్ర ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బరిలోకి దిగింది. తన శక్తి మేరకు పోరాడింది. తామూ ఉన్నామని నిరూపించుకుంది. అలాగే తెలంగాణలో కూడా చేస్తామని అంటోంది.

Untitled Document
Advertisements