నగరంలో శోభాయాత్రకు సర్వం సిద్ధం

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 12:35 PM

నగరంలో శోభాయాత్రకు సర్వం సిద్ధం

వినాయక నిమజ్జనం అంటే తెలుగు రాష్ట్రాల్లో కళ్లముందు కదిలేది శోభాయాత్రం. హైదరాబాద్‌లో కన్నుల పండువలా జరిగే ఈ ఊరేగింపుకు పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఆదివారం శోభాయత్ర సందర్భం నగరంలో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. ఈ నెల 23,24 తేదీల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.

- నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
- యాత్ర రూట్లలో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- పలు కూడళ్లల్లో వాహనాల మళ్లింపు
- పశ్చిమం నుంచి తూర్పుకు బషీర్‌బాగ్ ైఫ్లెఓవర్ కింది నుంచి అనుమతి
- హెల్ప్‌లైన్ నెంబర్లు 040-27852482,9490598985, 9010203626
- పార్కింగ్ స్థలాల ఏర్పాటు : సీపీ అంజనీకుమార్

సెప్టెంబర్‌ 23 ఆదివారం

ఆదివారం ఉదయం 1.55 నుంచి 2.55 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌ రమడా, పీఎన్‌టీ జంక్షన్‌ వరకు ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయి. బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, పంజాగుట్ట క్రాస్‌ రోడ్స్‌, శ్రీనగర్‌ టీ జంక్షన్‌, ఎల్‌వీ ప్రసాద్‌ హాస్పటల్‌, కేబీఆర్‌ పార్క్‌, కేన్సర్‌ హాస్పటల్‌, ఒడిశా ఐలాండ్‌, రోడ్‌ నెం.12 వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

సాయంత్రం రోడ్‌ నెం.12 నుంచి ఒరిస్సా ఐలాండ్‌, కేన్సర్‌ హాస్పటల్‌, ఎన్‌టీఆర్‌ భవన్‌, సాగర్‌ సొసైటీ, శ్రీనగర్‌ కాలనీ, నాగార్జున సర్కిల్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, యశోదా హాస్పటల్‌, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా నెక్ల్‌సరోడ్‌ రోటరీ నుంచి క్రేన్‌ నంబర్‌ 4 వరకూ ఉంటాయి. తిరిగి అక్కడి నుంచి నెక్ల్‌సరోడ్‌ రోటరీ మీదుగా ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, మెట్రో రెసిడెన్సీ, రాజ్‌భవన్‌, యశోదా హాస్పటల్‌, పంజాగుట్ట, శ్రీనగర్‌కాలనీ, సాగర్‌ సొసైటీ, కేబీఆర్‌ పార్క్‌, టీఆర్‌ఎస్‌ భవన్‌, ఒరిస్సా ఐలాండ్‌ మీదుగా రోడ్‌ నం. 12 వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

సెప్టెంబర్‌ 24 సోమవారం

ఉదయం 9.25 నిమిషాల నుంచి 10.15 వరకూ రోడ్‌ నెం.12 నుంచి ఒరిస్సా ఐలాండ్‌, కేన్సర్‌ హాస్పటల్‌, ఎన్‌టీఆర్‌భవన్‌, సాగర్‌ సొసైటీ, శ్రీనగర్‌ కాలనీ, నాగార్జున సర్కిల్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, న్యూబ్రిడ్జి వై జంక్షన్‌, బల్కంపేట్‌ అండర్‌పాస్‌, ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా బాలానగర్‌లోని ఎన్‌ఆర్‌ఎ్‌ససీ ఆడిటోరియం వరకూ తిరిగి 11.15 నిమిషాల నుంచి 12 గంటల వరకూ బాలానగర్‌ నుంచి బల్కంపేట రోడ్‌, న్యూబ్రిడ్జి, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, పంజాగుట్ట క్రాస్‌ రోడ్స్‌, శ్రీనగర్‌ టీ జంక్షన్‌, ఎల్‌వీ ప్రసాద్‌ హాస్పటల్‌, కేబీఆర్‌ పార్క్‌, కేన్సర్‌ హాస్పటల్‌, ఒరిస్సా ఐలాండ్‌, రోడ్‌ నెం.12 వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

మధ్యాహ్నం 2.45 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకూ రోడ్‌నెం.12 బంజారాహిల్స్‌ నుంచి ఒరిస్సా ఐలాండ్‌, కేన్సర్‌ ఆస్పత్రి, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌, సాగర్‌ సొసైటీ, శ్రీనగర్‌ టి జంక్షన్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌. బేంగంపేట ఫ్లై ఓవర్‌, షాపర్స్‌ స్టాప్‌ల మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి. రెండురోజుల పాటు ఈ నిబంధనలు ఉంటాయన వాహనదారులకు సహాకరించాలని సీపీ సూచించారు.

Untitled Document
Advertisements