టీడీపీ అభ్యర్థుల వివరాలు

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 12:49 PM

టీడీపీ అభ్యర్థుల వివరాలు

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం క్రమంగా ఒక కొలిక్కి వస్తోంది. తాము పోటీ చేయాలనుకుంటున్న 19 నియోజకవర్గాల్లో అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సమర్పించింది. ఎక్కడైతే క్యాడర్ బలంగా ఉందని భావిస్తోందో... ఆ నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయనుంది. తమ అభ్యర్థుల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అందజేశారు.

1. దేవరకద్ర – రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
2. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
3. మహబూబ్ నగర్- చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్ ), మాజీ ఎమ్మెల్యే
4. రాజేంద్రనగర్ – భూపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు
5. శేర్ లింగం పల్లి -మండవ వెంకటేశ్వర రావు , మాజీ మంత్రి లేదా మొవ్వ సత్యనారాయణ
6. కూకట్ పల్లి- శ్రీనివాస రావు , కార్పేరేటర్
7. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – ఎం.ఎన్.శ్రీనివాస్ రావు, గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షులు
8. సికింద్రాబాద్ – కూన వెంకటేష్ గౌడ్,
9.ఉప్పల్- వీరేందర్ గౌడ్
10. ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి, టిఎన్ టియుసి అధ్యక్షుడు
11. కోరుట్ల-ఎల్ . రమణ , టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
12. హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి ,మాజీ మంత్రి
13. ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ , మాజీ ఎమ్మెల్యే
14. పరకాల లేదా వరంగల్ వెస్ట్ – రేవూరి ప్రకాష్ రెడ్డి
15. ఆలేరు – శోభారాణి, తెలంగాణ టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు
16. కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్
17. మిర్యాలగూడ -శ్రీనివాస్ (వ్యాపార వేత్త, కమ్మ సామాజిక వర్గం)
18. ఖమ్మం – నామా నాగేశ్వర రావు , మాజీ ఎంపీ
19. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్యే

Untitled Document
Advertisements