కాపు జెఏసి.. త్వరలో కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 01:03 PM

కాపు జెఏసి.. త్వరలో కీలక నిర్ణయం

రిజర్వేషన్ల పేరుతో రాజకీయ పార్టీలు తమను మోసం చేశాయని రగిలిపోతున్న కాపు జెఏసి.. త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. భవిష్యత్ కార్యాచరణ పై ఈ నెల 25, 26 తేదీల్లో సమావేశం కానున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసంలోనే ఈ సమావేశం జరుగనుంది. కాపు ఓట్ల కోసమే చంద్రబాబు రిజర్వేషన్ల డ్రామా ఆడారని రగిలిపోతున్న కాపులు వచ్చే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వాలి అనే అంశం పైనే ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అలాగే కాపు రిజర్వేషన్లపై వైస్ జగన్ మాట్లాడిన మాటలను తప్పు పట్టిన ముద్రగడ.. వైసీపీ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది కాపు జెఏసి నేతలు జనసేన అధినేత పవన్ వైపే మొగ్గు చూపిస్తున్నారు అని తెలుస్తుంది.





Untitled Document
Advertisements