విక్టరీ వెంకటేశ్ కూతురు వివాహానికి సన్నాహాలు

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 01:13 PM

విక్టరీ వెంకటేశ్ కూతురు వివాహానికి సన్నాహాలు

విక్టరీ వెంకటేశ్‌కు బంధుగణం ఎక్కువే. దగ్గుబాటి కుటుంబంలోని చాలామంది సినీరంగంలో రాణిస్తున్నారు. అయితే ఆయన మాత్రం తన సొంత కుటుంబం నుంచి వారసులను రంగంలోకి తీసుకురాలేదు. పిల్లలను ప్రస్తుతానికి సినీపరిశ్రమకు దూరంగా ఉంచుతున్నారు. పెద్ద కూతురు ఆశ్రిత బిస్కెట్ల వ్యాపారంలోకి ఇటీవలే అడుగు పెట్టింది.

ఆశ్రిత ప్రేమపెళ్లికి వెంకటేశ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజా సమాచారం. అది కూడా ఆమెకు నచ్చిన వ్యక్తితోనే ముడిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆశ్రిత ప్ర‌ముఖ వ్యాపారి, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌డిని ప్రేమించిందని, అతనితో పెళ్లికి వెంకటేశ్ కూడా అంగీకరించారని టాలీవుడ్ వర్గాల భోగట్టా. వెంకటేశ్ అన్న సురేశ్ ఇటీవల.. అబ్బాయికి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారని, తర్వలోనే నిశ్చితార్థం ఉంటుందని చెబుతున్నారు. వెంకటేశ్ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నారని, రాగానే నిశ్చితార్థం ఉంటుందని అంటున్నారు. అబ్బాయి తండ్రి రఘురామరెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితడు. ఆశ్రిత బిస్కెట్లకు సంబంధించి అంతర్జాతీయ కోర్సు చేసింది.అంతర్జాతీయ ప్రమాణాలుండే కుకీస్, బిస్కెట్స్, కుకీస్ తయారీ గురించి తెలుసుకుంది. రామానాయుడు స్టూడియోలో స్టాల్స్ కూడా పెట్టింది.





Untitled Document
Advertisements