అక్టోబర్ 5వ తేదీన విజయ్ చిత్రం

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 01:15 PM

అక్టోబర్ 5వ తేదీన విజయ్  చిత్రం

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' కోసం ఆడియన్స్ ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ విజయంతో విజయ్ మార్కెట్ రెడ్ హాట్ గా ఉండడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా పై అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ గా ఫిక్స్ అయింది.తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా విజయ్ దేవరకొండ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా కనిపించనుండగా, సత్యరాజ్ .. నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు.

Untitled Document
Advertisements