మెడికల్ షాపులు బంద్

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 01:59 PM

మెడికల్ షాపులు ఈ నెల 28న దేశవ్యాప్త బంద్ ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మందులను అమ్మేందుకు కొత్త చట్టం తీసుకురావడంతోపాటు వివిధ మార్పులు తీసుకొస్తోంది. ఇవి తమ పొట్టకొట్టేలా ఉన్నాయని మెడికల్ షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ ఇండియా కెమిస్ట్స్‌ & డ్రగిస్ట్స్‌ అసోసియేషన్‌ సెప్టెంబరు 28న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ కూడా మెడికల్ షాపుల బంద్‌ను ప్రకటించింది.

ప్రిస్కిప్షన్‌ లేకుండా ఔషధాలను ఆన్‌లైన్‌లో అమ్మడం డ్రగ్స్‌ చట్టం నిబంధనకు వ్యతిరేకమని షాపుల యజమానులు అంటున్నారు. దేశంలో 9 లక్షల మంది, రాష్ట్రంలో 20వేల మంది డ్రగ్గిస్టులు ఉన్నారని వారికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వస్తే రోగులు కూడా కష్టాలు పడతారని, కేంద్రం ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements