ఎన్.టి.ఆర్ @ బిగ్ బాస్

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 06:54 PM

ఎన్.టి.ఆర్ @ బిగ్ బాస్

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మరో రెండు వారాల్లో ఫైనల్స్ కు వెళ్తుంది. అంటే రెండు వారాల్లో టైటిల్ ఎవరు గెలుస్తారో డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో ఫైనల్స్ కు గెస్ట్ గా నాగార్జున వస్తున్నాడని నిన్న మొన్నటి దాకా హంగామా చేశారు. దేవదాస్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ 2 ఫైనల్స్ కు నాగార్జున సర్ ప్రైజ్ గెస్ట్ గా వస్తాడని అన్నారు. అంతేకాదు ఫైనల్ విజేత ఎవరన్నది కూడా నాగార్జున ఎనౌన్స్ చేస్తారని తెలుతుంది.

ఇదిలాఉంటే బిగ్ బాస్ ఫైనల్స్ కు వచ్చేది నాగార్జున కాదు ఎన్.టి.ఆర్ అనేస్తున్నారు ఫిల్మ్ నగర్ వర్గాల వారు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా బిగ్ బాస్ ఫైనల్స్ కు తారక్ ను రప్పించి షోని మరింత సూపర్ హిట్ అయ్యే ప్లాన్ చేశారట. అందుకు తారక్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. మరి ఇద్దరు హోస్టులు చేసే బిగ్ బాస్-2 ఫైనల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Untitled Document
Advertisements