విజయ్ దేవరకొండ భారీ ప్లాన్

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 10:42 AM

విజయ్ దేవరకొండ భారీ ప్లాన్

విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాతో తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ప్రస్తుతం నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. అయితే తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ వేశాడట ఈ రౌడీ స్టార్.ప్రస్తుతం తమిళ నాడులో చెన్నైలోనే కాదు అన్ని ఏరియాలు కవర్ చేసేలా ప్రమోషన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ అయితే తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం రెండు భారీ వేడుకలను నిర్వహించాలని చూస్తున్నాడట. ఒక హైదరాబాద్ లో.. మరోటి విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నాడట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న నోటా సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశారు. అందువల్ల విజయవాడ ఈవెంట్కి భారీగానే అభిమానుల్ని తరలి వస్తారన్న సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 30న ఓ ఈవెంట్ - అలానే అక్టోబర్ 1న వేరొక ఈవెంట్ ని `ది నోటా పబ్లిక్ మీట్` పేరుతో భారీగా చేయనున్నారని తెలుస్తోంది.

మరి విజయ్ సక్సెస్ మేనియా ఈ సినిమా కొనసాగిస్తుందో లేదో చూడాలంటే అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

Untitled Document
Advertisements