స్టార్ హీరో సంచలన నిర్ణయం

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 12:08 PM

స్టార్ హీరో సంచలన నిర్ణయం

స్టార్ హీరో విజయ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. సౌత్ లో క్రేజీ ఫ్యాన్స్ ఉన్న వారిలో ఆయన ఒకరు. తమిళంలో రజినికి ధీటుగా ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే రజినిని మించి విజయ్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇది తనకే ఎఫెక్ట్ పడేలా చేసింది. మొన్నీమధ్య తన అభిమాని ఇంట పెళ్లికి వెళ్లిన విజయ్ అక్కడ చేదు అనుభవాన్ని ఫేస్ చేశాడు.

వేలకొద్ది ఫ్యాన్స్ రావడంతో అక్కడ తనకు రక్షణ ఇవ్వాల్సిన బాడీ గార్డ్స్ కూడా అతన్ని కాపాడలేకపోయారు. ఆ సందర్భంలో ఆయన కింద పడటం కూడా జరిగింది. అభిమానం ఉంటే ఉండొచ్చు కాని దాని వల్ల అభిమానించిన వ్యక్తి ఇబ్బంది పడుతుంటే ఎలా చెప్పండి. అందుకే ఇక పబ్లిక్ ఫంక్షన్స్ కు వచ్చేది లేదని తెగేసి చెప్పాడట విజయ్.

అలా వచ్చి అభిమానులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తాను ఇబ్బంది పడటం ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి విజయ్ ను ఇక బయట చూడాలంటే ఫుల్ సెక్యూరిటీ ఉన్న ప్రదేశం మాత్రమే అని మాత్రం చెప్పొచ్చు.

Untitled Document
Advertisements