పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న హీరో రామ్

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 12:10 PM

పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న హీరో రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కోసం హీరో రామ్, సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోశిస్తున్న ప్రకాశ్ రాజ్ ఇద్దరు సింగర్స్ గా మారడం జరిగింది.

సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే సాంగ్ కావడంతో దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరిని ఒప్పించి ఈ సాంగ్ వారి చేతే పాడించాడట. ఫ్రెండు ఫ్రెండు మార్చు ట్రెండు అంటూ సాంగ్ లిరిక్స్ ఉంటాయని తెలుస్తుంది. ఉన్నది ఒకటే జిందగి నిరాశపరచగా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. మరి రామ్, ప్రకాశ్ రాజ్ ల సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. గతం లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ పాడి ఫాన్స్ ని ఉర్రుతలూగించాడు.

Untitled Document
Advertisements