పవన్ కల్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన చింతమనేని ప్రభాకర్

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 12:47 PM

పవన్ కల్యాణ్ పై సంచలన  ఆరోపణలు చేసిన చింతమనేని ప్రభాకర్

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. బుధవారం ప్రజాపోరాట యాత్రలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యేపై పవన్ చేసిన ఆరోపణలకు గాను గురువారం చింతమనేని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయ అంటే గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగులు చెప్పినట్లు కాదు.. నువ్వు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల్లో నుంచి గౌరవంగా తప్పుకుంటా.. రాష్ట్రా స్థాయి నాయకుడైన నువ్వు ..నన్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది అంటూ పవన్ని ఉద్దేశించి మాట్లాడారు.

Untitled Document
Advertisements