ఆసియా కప్‌ ఎవరి సొంతం ?

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 12:59 PM

ఆసియా కప్‌ ఎవరి సొంతం ?

ఆసియా కప్‌ సిరీస్‌లో ఆది నుంచి ఓటమి చవిచూడకుండా వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా అంతిమ సమరానికి సిద్ధమైంది... ఇవాళ జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలబడబోతోంది.మరోవైపు బంగ్లాదేశ్ జట్టు టోర్నీలో ఎప్పటికప్పుడు తన ప్రదర్శనని మెరుగుపర్చుకుంటూ అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్థాన్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో గెలుపొందడం బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. కానీ.. పెద్ద టోర్నీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన రికార్డు బంగ్లాదేశ్‌కి లేదు..

ఇక జట్ల విషయానికి వస్తే భారత్‌: శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, ధోని, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌, యుజ్వేంద్ర చాహల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాతో బరిలోకి దిగే అవకాశం ఉండగా... బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మొమినుల్‌ హక్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మద్‌ మిథున్‌, ఇమ్రుల్‌ కయెస్‌, మహ్మదుల్లా, మష్రఫె మొర్తజా, మెహదీ హసన్‌, రుబెల్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ తుదిపోరుకు సిద్ధమవుతున్నారు.

Untitled Document
Advertisements