27 మందితో బిఎల్‌ఎఫ్‌

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 01:27 PM

27 మందితో బిఎల్‌ఎఫ్‌

సిపిఎం నేతృత్వంలో 28 రాజకీయ పార్టీలతో ఏర్పాటయిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 27 మందితో కూడిన తమ అభ్యర్ధుల మొదటి జాబితాను గురువారం విడుదల చేసింది. వారిలో ఎంసిఐ(యు)-3, టీబీఎస్పి-1, లోక్‌సభ సత్తా-1, సిపిఎం-9, బీఎల్‌పీ-13 మంది ఉన్నారు. అభ్యర్ధులలో బీసీలు-13, ఎస్సీలు-8, ఎస్టీలు-3 మంది ఉన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, కూటమిలో ఇతర పార్టీల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొక వారం రోజులలోపే రెండవ జాబితాను కూడా విడుదల చేస్తామని నల్లా సూర్య ప్రకాశ్ తెలిపారు.

సిపిఎం అభ్యర్థులు
నియోజకవర్గం అభ్యర్థిపేరు

1. ఖానాపూర్‌ (ఎస్టీ) తొడసం భీంరావు
2. మానకొండూరు(ఎస్సీ) మర్రి వెంకటస్వామి
3. నర్సాపూర్‌ ఎ మల్లేశ్‌
4.మిర్యాలగూడ జూలకంటి రంగారెడ్డి
5.హుజూర్‌నగర్‌ శేఖర్‌రావు
6.కోదాడ బుర్రి శ్రీరాములు
7.భద్రాచలం(ఎస్టీ) మిడియం బాబురావు
8.వైరా (ఎస్టీ) భూక్యా వీరభద్రం
9.సత్తుపల్లి (ఎస్సీ) మాచర్ల భారతి

బిఎల్‌పి అభ్యర్థులు
నియోజకవర్గం అభ్యర్థిపేరు

1.సిర్పూర్‌ కోట వెంకన్న
2.చొప్పదండి(ఎస్సీ) కనకం వంశీ
3.కరీంనగర్‌ వసీమోద్దీన
4.ఆంథోల్‌ (ఎస్సీ) పి జయలక్ష్మి
5.మేడ్చల్‌ గుజ్జా రమేశ్‌
6.దేవరకద్ర జయరాములు
7.కొడంగల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు
8.వనపర్తి జింకల కృష్ణయ్య
9.గద్వాల రంజిత్‌కుమార్‌
10. సూర్యపేట రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌
11. వరంగల్‌ ఈస్ట్‌ సిద్దం రాము
12. వర్థన్నపేట వసపాక నర్సింహా
13. మధిర (ఎస్సీ) డాక్టర్‌ కోట రాంబాబు

ఎంసిపిఐ(యు) అభ్యర్థులు

1.బెల్లంపల్లి (ఎస్సీ) సబ్బని కృష్ణ
2.శేరిలింగంపల్లి తాండ్ర కుమార్‌
3.నర్సంపేట మద్దికాయల అశోక్‌

టిబిఎస్‌పి అభ్యర్థి

1.నాగర్‌కర్నూల్‌ శ్రీనివాస్‌ బహద్దూర్‌
తెలంగాణ లోక్‌సత్తా అభ్యర్థి
1.రాజేంద్రనగర్‌ రాఘవేంద్రస్వామి





Untitled Document
Advertisements