కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 01:33 PM

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా

టిఆర్ఎస్‌ ఎంపి డి.శ్రీనివాస్ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం నిజామాబాద్‌లో తన కుమారుడు ధర్మపురి సంజయ్, తన అనుచరుల సమక్షంలో కేక్ కట్ చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నందున ఆయన ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తాజా సమాచారం. ఆయన పదవులు, టికెట్ల కోసమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అందరికీ తెలుసు. ఈసారి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్‌ను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఎంపి కవిత తదితరులు వ్యూహాలు రూపొందించుకొని పనిచేస్తున్నప్పుడు, ఆరోగ్యం సహకరించని స్థితిలో ఉన్న డి.శ్రీనివాస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏవిదంగా సహాయపడగలరో తెలియదు.

Untitled Document
Advertisements