కొత్త పధకాలు, ప్రాజెక్టులపై ఎటువంటి ప్రకటనా చేయకూడదు

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 01:56 PM

కొత్త పధకాలు, ప్రాజెక్టులపై ఎటువంటి ప్రకటనా చేయకూడదు

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజత్ కుమార్ గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శాసనసభను రద్దు చేసిన రోజు (సెప్టెంబరు 6)నుంచే తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కనుక ఎన్నికలు పూర్తయ్యి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ప్రస్తుతం అధికారంలోఉన్న ఆపధర్మ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. అలాగే కొత్త పధకాలు, ప్రాజెక్టులపై ఎటువంటి ప్రకటనా చేయకూడదు. అయితే రైతుబంధు పధకం ఇదివరకే ప్రారంభించబడినందున దానిని కొనసాగించనీయాలా వద్దా అనే విషయంపై కేంద్ర ఎన్నికల కమీషన్ సలహా తీసుకొంటాము. ఎందుకంటే సాధారణంగా పాత పధకాలను కొనసాగింపుకు ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కొత్త వాటికే కోడ్ వర్తిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం దానిలో అధికారులు ఆ నిబందనలకు అనుగుణంగా నడుచుకోవలసి ఉంటుంది,” అని చెప్పారు.





Untitled Document
Advertisements