మరో క్రేజీ మల్టీస్టారర్

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 06:04 PM

మరో  క్రేజీ మల్టీస్టారర్

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్న త్రివిక్రం శ్రీనివాస్ తన తర్వాత సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దసరాకు తారక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వెంకటేష్, అల్లు అర్జున్ లతో త్రివిక్రం ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

వెంకటేష్ కు ఆల్రెడీ లైన్ వినిపించాడట.. అతని నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అయితే బన్ని కూడా ఓకే అంటే మరో అద్భుతమైన మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నట్టే. వెంకటేష్ కు ఆల్రెడీ నిర్మాత రాధాకృష్ణ డబ్బులు ఇచ్చాడట. బన్ని కాదంటే మాత్రం మరో హీరో కోసం వెతకాల్సి ఉంది. త్రివిక్రం సినిమా అంటే బన్ని నో అనే ఛాన్స్ లేదు. మరి బన్ని, వెంకీల మల్టీస్టారర్ పై త్వరలో ఓ ఫైనల్ డెశిషన్ తీసుకుంటారట.

Untitled Document
Advertisements