11 ఏళ్లు పూర్తి అయ్యాయంటే నమ్మలేకపోతున్నా

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 06:40 PM

11 ఏళ్లు పూర్తి అయ్యాయంటే నమ్మలేకపోతున్నా

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రామ్‌చరణ్‌. ‘చిరుత’ తో మొదలైన చరణ్‌ సినీ కెరీర్‌లో ‘మగధీర’ మైలురాయిగా నిలిచింది. ధృవ, రంగస్థలం సినిమాలు చరణ్‌ను నటుడిగా ఓస్థాయికి తీసుకెళ్లాయి. రామ్‌చరణ్ తన నటప్రస్థానానికి ఈ రోజుతో 11సంవత్సరాలు పూర్తి అయింది

ఈ సందర్భంగా చరణ్‌ తన ఈ విజయానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటికే 11 ఏళ్లు పూర్తి అయ్యాయంటే నమ్మలేకపోతున్నా. నిన్నే నటించడం ప్రారంభించిన ఫీలింగ్‌లో ఉన్నా. మీరు చూపిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో భాగస్వాములైన దర్శకులు, నిర్మాతలు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గౌరవంగా ఉంది. లవ్‌ యూ ఆల్‌’ అని ఆయన పేర్కొన్నారు.







Untitled Document
Advertisements