గీత ఆర్ట్స్ నిర్మాణం లో నాగ శౌర్య

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 10:00 AM

గీత ఆర్ట్స్ నిర్మాణం లో నాగ శౌర్య

ఛలో సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న నాగ శౌర్య ఆ తర్వాత మళ్లీ వరుస అపజయాలను మూట కట్టుకున్నాడు. సొంత బ్యానర్ లో లేటెస్ట్ గా వచ్చిన నర్తనశాల సినిమా కూడా నిరాశపరచింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్న నాగ శౌర్య గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా సైన్ చేశాడని తెలుస్తుంది.

నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆ కథకు నాగ శౌర్య పర్ఫెక్ట్ అనిపించి బన్ని వాసు శౌర్యకు కథ వినిపించాడట. హీరోకి ఆ కథ నచ్చేయడంతో సినిమా కన్ ఫాం చేశారట. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుండి వస్తున్న మినీ బడ్జెట్ సినిమాలు మంచి కంటెంట్ వాల్యూ తో వస్తున్నాయి. మరి నాగ శౌర్య కెరియర్ గాడిలో పడేలా ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.

Untitled Document
Advertisements