ఆసియా కప్: భారత్ విజయ భేరి

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 10:51 AM

 ఆసియా కప్:  భారత్ విజయ  భేరి

ఆసియా కప్‌లో తమకు తిరుగులేదని భారత్ మరోమారు చాటి చెప్పింది. బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. ఢాకా వేదికగా 2016లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్‌ని ఓడించే భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఆసియా కప్ చరిత్రలో టీమిండియా విజేతగా నిలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.

ఫైనల్లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. భారత్ తరఫున 5 మ్యాచ్‌ల్లో 342 పరుగులు చేసిన శిఖర్ ధవన్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌'గా ఎంపికయ్యాడు.

ఫైనల్లో భారత్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో చివరకు విజయం కూడా సాధించింది. కానీ బంగ్లాదేశ్‌ ఇచ్చిన లక్ష్యాన్ని అందుకోడానికి భారత బ్యాట్స్‌మెన్లు చాలా చెమటోడ్చాల్సి వచ్చింది.

Untitled Document
Advertisements