బిగ్ బాస్ చీఫ్‌గెస్ట్ ఎవరో తెలుసా..

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 04:40 PM

బిగ్ బాస్ చీఫ్‌గెస్ట్ ఎవరో తెలుసా..

కొద్ది రోజులుగా ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసిన బిగ్ బాస్ 2 షో చివరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారంతో బిగ్ బాస్ సీజన్ 2 కు శుభంకార్డు పడనుంది. 17 మందితో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం ఐదుగురు సభ్యులతో హోరాహోరిగా సాగుతోంది. కౌశల్, తనీష్, సామ్రాట్, గీతామాధురి, దీప్తి నల్లమోతు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఫినాలేకి ముందు ఎలిమినేటైన కంటెస్టెంట్ లు అందరు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి, సందడి చేశారు.

అయితే బిగ్ బాస్-2 ఫైనల్ ఎపిసోడ్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారనే విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. కొందరు బిగ్ బాస్ సీజన్ 1‌కి హోస్ట్‌గా వ్యవహరించిన హీరో ఎన్టీఆర్ వస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ తాజాగా విక్టరీ వెంకటేశ్ హాజరుకానున్నరట. బిగ్ బాస్ సిజన్ 2 విజేత ఎవరని ప్రకటించి, అదిరిపోయే స్పీచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాదు తమిళ బిగ్ బాస్ ఫైనల్‌కి విజయ్ దేవరకొండ గెస్ట్‌గా హాజరవుతున్నడని తెలుస్తోంది. బిగ్ బాస్ 1 సీజన్‌ను ఎన్టీఆర్ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. రెండో సీజన్లో నాని హోస్టింగ్ కంటే సభ్యుల మధ్య వివాదాల కారణంగానే షో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అయితే బిగ్‌బాస్ టైటిల్ ఈ ఐదుగురిలో ఎవరు కైవసం చేసుకుంటారు. విజేతగా నిలిచి రూ.50లక్షల నగదును ఎవరు పొందుతారో తెలియలి అంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వెచి చూడాల్సిందే.

Untitled Document
Advertisements